పోలీసోడి దర్శకుడితో మహేష్ సినిమా..!
on Apr 12, 2016

మంచి సినిమా చూసినప్పుడు, ఆ మూవీ టీంను అభినందించడం హీరో మహేష్ కు ఉన్న మంచి అలవాట్లలో ఒకటి. లేటెస్ట్ గా పోలీసోడు ట్రైలర్ చూసిన మహేష్, ఆ మూవీ దర్శకుడు అట్లీకి ఫోన్ చేసి అభినందించాడట. అంతేకాదు, మంచి కథ ఉంటే మనిద్దరం సినిమా చేద్దామంటూ చెప్పాడట. మహేష్ కు ఇప్పటికే తెలుగులో తిరుగులేని మార్కెట్ ఉండగా, తమిళ, మళయాళ మార్కెట్స్ ను కూడా పెంచుకునే పనిలో ఉన్నాడు. శ్రీమంతుడు టైం నుంచి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. శ్రీమంతుడు రెండు భాషల్లో రిలీజయ్యింది. ఇప్పుడు బ్రహ్మోత్సవం కూడా తమిళ, తెలుగు భాషల్లో రిలీజవుతుందట. మరో వైపు మురుగదాస్ తో మరో బైలింగ్వల్ యాక్షన్ ఫిల్మ్ కోసం రెడీ అయ్యాడు మహేష్. ఆ తర్వాత అట్లీ తో సినిమా ఫైనల్ చేస్తాడని సమాచారం. పోలీసోడు రిలీజైన తర్వాత అట్లీతో సినిమాపై మహేష్ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ తో పాటు, సాంగ్స్ షూట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కాగా సమ్మర్ కానుకగా బ్రహ్మోత్సవాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు సూపర్ స్టార్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



