సింహం సింగిల్..మహేష్ బాబు అంటే అంతే మరి
on Apr 15, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)దర్శక ధీరుడు రాజమౌళి(ss rajamouli)కాంబోలో తెరకెక్కుతున్న ssmb29 (వర్కింగ్ టైటిల్) తన మొదటి షెడ్యూల్ ని ఒడిస్సా(Odissa)లోని కోరాపుట్ జిల్లాలో జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు చిత్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్( పై పలు కీలక సన్నివేశాలని చిత్రీకరించడం జరిగింది. ఈ షెడ్యూల్ తర్వాత షూట్ కి గ్యాప్ రావడంతో మహేష్ తన ఫ్యామిలీ తో కలిసి ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే.
మహేష్ ఈ రోజు ఉదయం ఇటలీ(italy)నుంచి హైదరాబాద్ కి వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ ని చూడగానే అభిమానులు ఫొటోలకి ఎగబడగా మహేష్ వాళ్లతో ఫోటోలు దిగాడు. అనంతరం అక్కడ్నుంచి సింగల్ గా నడుచుకుంటు వెళ్లి తన కారు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా, సదరు వీడియో వైరల్ గా మారింది. మహేష్ లుక్ హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక 'రాజమౌళి' కూడా'ఆర్ ఆర్ ఆర్ బి హైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీ ప్రచారం కోసం జపాన్ వెళ్ళాడు.ప్రస్తుతం రాజమౌళి జపాన్ లోనే ఉన్నాడు. అక్కడ్నుంచి రాగానే మరో షెడ్యూల్ ప్రారంభం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ssmb29 పై మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా 2027 మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రావచ్చనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
