మహేష్‌ది ప్రేమకథే!
on Apr 15, 2020
సూపర్‌స్టార్ మహేష్‌బాబు అందమైన ప్రేమకథలో నటించి ఎంత కాలమైంది? ఠక్కున సమాధానం చెప్పడం కష్టమే. ఈమధ్య ఆయన సందేశాత్మక కథల్లో ఎక్కువ నటిస్తున్నారు. అలాగని, వాటిలో ప్రేమకథలు లేవా? అంటే ఉంటున్నాయి. కానీ, ప్రేమకథల పరిధి తక్కువగా ఉంటుంది. 'ఒక్కడు' తర్వాత, అంతలా ప్రేమకథ ప్రధానంగా ఉన్న సినిమా మహేష్ చేయలేదేమో!? మహేష్ మళ్లీ మంచి ప్రేమకథలో నటిస్తే చూడాలని, ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దర్శకుడు పరశురామ్ ఆ కోరిక తీర్చబోతున్నారు. మహేష్‌ను మనసులో పెట్టుకుని ఆయన ప్రేమకథ రాశారు.
మహేష్ బాబు కథానాయకుడిగా పరశురామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పక్కా ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ యాడ్ చేశారట. 'గీత గోవిందం'లోనూ చక్కటి ప్రేమకథకు కుటుంబ అనుబంధాలు, వినోదం మేళవించి పరశురామ్ తీశారు. మహేష్ ఇమేజ్‌కి సూటయ్యే సరికొత్త ప్రేమకథతో, సూపర్‌స్టార్ స్టైల్‌కి తగ్గ యాక్షన్ తో సినిమా తీయడానికి ప్లాన్ చేశారట. అన్నట్టు... ఈ సినిమాలో ఒక పాత్రకు కన్నడ నటుడు ఉపేంద్రను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం లేదని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
