రాముడిగా మీరు ఊహించనంత అందాన్ని, పరాక్రమాన్ని మహేష్‌లో చూస్తారు!
on Nov 15, 2025
మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రానికి సంబంధించి నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేష్ గురించి, సినిమా పట్ల అతనికి ఉన్న ప్యాషన్ గురించి, అతని క్రమశిక్షణ గురించి మాట్లాడారు రాజమౌళి.
‘మహేశ్‌బాబు నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అతను సెట్‌లో అడుగు పెట్టాడు అంటే సెల్ ఫోన్ అనేది అతని దగ్గర ఉండదు. కారులోనే పెట్టేసి వస్తాడు. షూటింగ్ పూర్తి చేసి కారెక్కిన తర్వాతే సెల్ ఫోన్ వాడతారు. ఇప్పటి జనరేషన్‌లో అది చాలా గొప్ప విషయం. నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నాకు రామాయణం, మహాభారతం అంటే ఎంతో ఇష్టం. నేను రామాయణంలోని సీన్స్ తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా కోసం ఒక్కో సీన్ రాస్తుంటే నేను గాలిలో ఉన్నానేమో అనిపించింది. మహేష్.. కృష్ణుడిగా అయితే బాగుంటాడని నా ఫీలింగ్. కానీ, ఫస్ట్ రోజే అతనికి రాముడి వేషం వేస్తుంటే నాకే గూస్‌బంప్స్ వచ్చాయి. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా మహేశ్ కనిపిస్తాడు. రాముడిగా అన్ని రసాలు పలిపించేశాడు. ఆ ఫోటోని మొదట నేను నా ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారు. ఎవరైనా చూస్తారేమోనని మళ్ళీ తీసేశాను’ అంటూ మహేష్‌ని ‘వారణాసి’ చిత్రంలో రాముడిగా చూపించబోతున్న విషయాన్ని రివీల్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



