రాజమౌళితో ఎప్పుడో అనుకున్నది.. ఇప్పటికి కుదిరింది!
on Jan 22, 2024
ఒక టాప్ డైరెక్టర్‌తోగానీ, టాప్ హీరోతోగానీ ఏ నిర్మాతయినా సినిమా చెయ్యాలంటే ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిందే. వారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడే రంగంలోకి దిగాలి. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఒక సినిమా ప్రారంభించి పూర్తి చెయ్యాలంటే సంవత్సరాల కాలం పడుతోంది. పైగా ఆ డైరెక్టర్‌కిగానీ, హీరోకిగానీ ఉన్న కమిట్‌మెంట్స్‌ని పూర్తి చెయ్యాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే తమ నంబర్ వచ్చే వరకు వెయిట్ చెయ్యక తప్పదు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందే సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. హీరో గెటప్ నుంచి, కథ, బ్యాక్‌డ్రాప్ వంటి విషయాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు, మహేష్‌కి రాజమౌళి కండీషన్స్ పెట్టాడని, సినిమాలోని ఆర్టిస్టుల సెలక్షన్ కోసం రాజమౌళి ముంబాయి వెళ్లాడని.. ఇలా రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ వార్తల్ని అంతే ఆసక్తిగా జనం కూడా చదువుతున్నారు. అయితే ఈ విషయాలను అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించినపుడే వాటికి బలం చేకూరుతుంది.
ఈ సినిమాకి సంబంధించి మరో అంశం ప్రచారంలో ఉంది. అదేమిటంటే ఈ సినిమాకు కె.ఎల్.నారాయణ ఒక్కరే నిర్మాత కాదనేది ఆ వార్త. భారీ బడ్జెట్‌తో నిర్మించే సినిమా కావడంతో మరికొంత మంది నిర్మాతలను కూడా కలుపుకొని ఈ సినిమా నిర్మాణాన్ని చేపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఒక్కరే నిర్మిస్తారని, మరెవరితోనూ భాగస్వామ్యం పెట్టుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. కె.ఎల్.నారాయణకు రాజమౌళి ఎప్పుడో.. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితమే సినిమా చెయ్యాల్సి ఉంది. రాజమౌళికి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఇంత డిలే అయింది. పది సంవత్సరాల క్రితం అయితే ఈ ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉండేదో తెలీదుగానీ, అనుకోకుండా ఇప్పుడు మహేష్ సెట్ అయ్యాడు. మహేష్‌తో కె.ఎల్.నారాయణ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
Also Read