పేరు మార్చుకుని బాలీవుడ్ కు చెక్కేసింది..!
on Apr 15, 2016

సినీఫీల్డ్ లో పాపం కొంతమంది ఎంత ప్రయత్నించినా, సక్సెస్ రాదు. పేర్లు మార్చుకున్నా, ఫీల్డ్ మార్చుకున్నా సక్సెస్ చాలా కష్టమవుతుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం నుంచీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది మధురిమ. అందాల ఆరబోతకు కూడా ఏమాత్రం అడ్డు చెప్పని ఈ భామకు అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. ఐటెం సాంగ్స్ లో ఊపేసినా, రాంచరణ్ లాంటి స్టార్ తో కలిసి ఆరెంజ్ లో నటించినా బ్రేక్ రాలేదు. మొన్నీమధ్యే టెంపర్ లో సైడ్ క్యారెక్టర్ కూడా వేసింది. ఇక తెలుగులో కష్టమే అనుకుందో ఏమో గానీ, నైరా బెనర్జీగా పేరు మార్చుకుని బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తోంది మధురిమ. సన్నీ లియోన్ లీడ్ రోల్ లో వస్తున్న వన్ నైట్ స్టాండ్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇక నుంచీ నైరా బెనర్జీ అన్న పేరుతోనే, బాలీవుడ్ లో అవకాశాలు కొట్టాలని ట్రై చేస్తోంది మధురిమ. వన్ నైట్ స్టాండ్ సినిమా, పూర్తి స్థాయి అడల్ట్ కంటెంట్ ఉండే సినిమా. ఇలాంటి సినిమాలకు ఇప్పుడు అక్కడ బాగానే ఆదరణ లభిస్తోంది కాబట్టి, మధురిమ కూడా సన్నీ తరహాలో సెటిల్ అయిపోతుందేమో మరి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



