
నా చెలి రోజావే, ఉత్తరాన ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అనే సాంగ్స్ తో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భామ మధుబాల(. నటిగా కూడా గుర్తుండి పోయే క్యారెక్టర్స్ చేసింది. రోజా, జెంటిల్ మెన్, అల్లరి ప్రియడు చిత్రాలే ఉదాహరణ. సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసిన మధుబాల ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది.
మధుబాల పెద్ద కుమార్తె అమయ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సంతోషకరమైన వార్తను మధుబాల ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించి తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం తమ కుటుంబమంతా పెళ్లి ఏర్పాట్లలో ఎంతో బిజీగా గడుపుతోంది. పెళ్లికూతురుగా మారబోతున్న అమయ ఆనందానికి సరిహద్దులు లేవని, ఉద్యోగం లేదా ఇతర పనుల గురించి ఆలోచించే సమయమే లేనంతగా ‘లా లా ల్యాండ్’ లాంటి ఆనంద ప్రపంచంలో విహరిస్తోంది.
Also read: ఇక నుంచి విజయ్ చికెన్ బిర్యానీ.. ఇళయ దళపతినా, మజాకానా!
చిన్న కుమార్తె కేయా నా బాటలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోయిన్ కావాలని
అనుకుంది . అయితే, కొంతకాలం నటనకు సంబంధించిన విషయాలను పరిశీలించి, అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న తర్వాత, నటనా రంగం తన మనస్తత్వానికి సరిపోదని నిర్ణయించుకుంది. దీంతో వ్యాపార రంగం వైపు దృష్టి సారించి ప్రస్తుతం తన తండ్రి ఆనంద్ షాతో కలిసి బిజినెస్ మెలకువలు నేర్చుకుంటూ ఇంటర్న్‌షిప్ చేస్తోందని, భవిష్యత్తులో సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా తన సొంత కెరీర్‌ను నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని మధుబాల వివరించారు.
Roja, Madhubala, Tollywood






