`ఆచార్య` తేదికి `లవ్ స్టోరి`?
on Apr 17, 2021
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో పలు సినిమాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. అలా పోస్ట్ పోన్ అయిన చిత్రాల్లో `లవ్ స్టోరి` ఒకటి. `ఫిదా` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో యువ సామ్రాట్ నాగచైతన్య, డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రచార చిత్రాలతో, పాటలతో ఈ సినిమాపై జనాల్లో ఎనలేని క్రేజ్ వచ్చింది. మరో వారం రోజుల్లో సినిమా రాబోతుందనగా.. శేఖర్ అండ్ టీమ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. వాయిదా విషయం ప్రకటించారు. అయితే, కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ఆ సమావేశంలో వెల్లడించలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్ `ఆచార్య` కోసం లాక్ చేసిన మే 13న `లవ్ స్టోరి` థియేటర్స్ లో సందడి చేయనుందట. `ఆచార్య`ని ముందుగా అనుకున్నట్లుగా మే 13న కాకుండా జూన్ 18న రిలీజ్ చేసే దిశగా కొరటాల అండ్ టీమ్ ఆలోచన చేస్తోందన్న కథనాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. `లవ్ స్టోరి` కొత్త రిలీజ్ డేట్ పై వస్తున్న వార్తలకు బలం చేకూరుతున్నట్లవుతోంది. త్వరలోనే `లవ్ స్టోరి` న్యూ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read