Home

»

Latest News

హీరోగా గ్రాండ్ ఎంట్రీ: లోకేష్ కనగరాజ్ DC మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఇవే

Aug 8, 2026 12:05PM

 


పాన్ ఇండియా వ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన స్టార్ డైరెక్టర్ 'లోకేష్ కనగరాజ్' నేను కూడా హీరోనే అంటూ నిన్న 'DC' తో ఎంట్రీ ఇచ్చాడు.  అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వామికా గబ్బి హీరోయిన్ కాగా టాక్ ఐతే పాజిటివ్ గానే వినపడుతుంది.

 

బాక్సాఫీస్ గణాంకాల వివరాల్లోకి వెళితే, మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా  4.70 కోట్ల గ్రాస్  సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా దాదాపు 3,504 షోలలో ప్రదర్శించబడిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ విషయానికొస్తే, 1 కోటి గ్రాస్ సాధించింది. ఈ రెండు కలిపి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజునే మొత్తం 5.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద బలమైన బోణీ కొట్టింది. భాషల వారీగా చూస్తే, తమిళ్ వెర్షన్ అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. తమిళ్‌లో మొదటి రోజు 2కోట్ల గ్రాస్ రాబట్టగా  థియేటర్లలో సగటున 45.57% ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలు 32.62% ఆక్యుపెన్సీతో ప్రారంభం కాగా, మధ్యాహ్నం 43%, సాయంత్రం 35.38% నమోదయ్యాయి. రాత్రి షోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో ఏకంగా 67.38% ఆక్యుపెన్సీ నమోదు కావటం విశేషం. తెలుగు వెర్షన్ కూడా మంచి ఆదరణ పొంది 1 కోటి వరకు గ్రాస్ సాధించినట్టుగా చెప్తున్నారు. తెలుగు EPIQ వర్షన్ ఏకంగా 71% ఆక్యుపెన్సీతో రికార్డు స్థాయి స్పందన పొందింది.  

 దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మేకింగ్, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, లోకేష్ కనగరాజ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో ఈ వీకెండ్‌లో 'DC' బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారీ రికార్డులు ఖాయమని అంటున్నారు.

lokesh kanagaraj, Dc, Wamiqa Gabbi


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com