‘లియో’ కలెక్షన్లతో నాకు సంబంధం లేదు : లోకేష్ కనకరాజ్
on Oct 30, 2023
‘మా నగరం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై చాలా తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ రేంజ్‌కి ఎదిగాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే మీడియా ఫ్రాంచైజ్‌ని క్రియేట్ చేసి దానిలో ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా సినిమాలను చేస్తూ ఆడియన్స్‌కి చక్కని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తున్నాడు లోకేష్. ఎల్‌సియులో భాగంగానే రూపొందిన ‘లియో’ అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలైంది. విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఒక వివాదం కొన్ని రోజులుగా నడుస్తోంది. లియో యూనిట్ సభ్యులు ప్రకటిస్తున్న కలెక్షన్లకు, వాస్తవంగా వున్న కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం లేదని థియేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గత కొంతకాలంగా చెబుతూనే ఉన్నాడు. ఈ కలెక్షన్ల విషయంలో ‘లియో’ టీమ్ రూ.5 కోట్ల స్కాం చేసిందని ఆయన ఆరోపించారు. లియో కలెక్షన్ల గురించి మాట్లాడినందుకు థియేటర్ కూడా అయిన నిర్మాత లలిత్‌కుమార్ తనను బెదిరిస్తున్నాడని అన్నారు. ఈ సినిమా కలెక్షన్ల వివాదం రోజురోజుకీ పెద్ద సమస్యగా మారిపోతోంది.
ఇదిలా ఉండగా, ‘లియో’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందిస్తూ ‘నేను థియేటర్లకు వెళ్లి రెస్పాన్స్ చూశాను. ఫస్ట్‌హాఫ్ ఓకే. సెకండాఫ్‌కి వచ్చేసరికి మిక్స్‌డ్ టాక్ విన్నాను. సెకండాఫ్‌లో ల్యాగ్ వుందని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇక కలెక్షన్ల విషయం నాకు సంబంధం లేదు. దాన్ని నిర్మాతలకే వదిలేస్తున్నాను’’ అన్నారు.
సుబ్రమణియన్ చెప్పిన విషయంలో వాస్తవం ఉందని ‘లియో’ సినిమా వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. కలెక్షన్ల గురించి టీమ్ చెప్పేది ఒకలా ఉంటే.. ఆన్‌లైన్ బుకింగ్స్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఆదివారం అయినా ఒక్క థియేటర్ కూడా హౌస్‌ఫుల్ అవ్వడం లేదు. సుబ్రమణియన్‌ని సపోర్ట్ చేసేవారు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. అయితే సినిమా రిజల్ట్ విషయంలో లోకేష్ చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంది. మరి ఈ విషయంలో నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read