వచ్చేనెలలో వస్తున్న ‘అల్లుడు శీను’
on Jun 23, 2014
.jpg)
నిర్మాతల కొడుకులు పరిశ్రమకు హీరోలుగా పరిచయమవడం తెలుగు పరిశ్రమలో ఎప్పటినుంచో వస్తున్న ట్రెండ్. ఈ కోవలో తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ‘అల్లుడు శీను’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 29న ఈ చిత్ర ఆడియోని కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. తాను పరిచయం చేసిన దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో తన తనయుడు తొలిచిత్రం రూపుదిద్దుకోవడం ఆనందంగా వుందని సురేష్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా, కెమెరా చోటా కే. నాయిడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



