చిరు అంటే ఇంద్రుడే.. పవన్ ఒక తుఫాను
on Oct 27, 2017
ఎల్బీ శ్రీరామ్.. నాటకాలు వేసుకొంటూ తెలుగు సినిమాలో రైటర్‌గా అడుగుపెట్టి స్టార్ రైటర్‌గా మన్ననలు అందుకొని.. ఆ తర్వాత తన మార్క్ కామెడితో టాలీవుడ్‌లోని గ్రేట్ కామెడియన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. యంగ్ కామెడియన్ల రాకతో ఇప్పుడు ఆఫర్లు రాకపోయినప్పటికీ.. తన మనసుకు నచ్చిన పనులతో బిజీగా ఉన్నారు.. తాజాగా తన జీవితంలోని జ్ఞాపకాలను, ఇండస్ట్రీలో తాను చూసిన ఎత్తుపల్లాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందులో భాగంగా టాలీవుడ్‌లోని ప్రముఖులకు తనమార్క్ బిరుదులు ఇచ్చారు.
చిరంజీవి అంటే ఇంద్ర..మెగా సింహాసనం
పవన్ అంటే.. ఒక జంఝా మారుతం
ఈవీవీ అంటే.. ఎవరెస్ట్
కె.విశ్వనాథ్ అంటే.. కళాతపస్వి.. దాదా సాహెబ్ యశస్వి.. తెలుగు సినిమాకు ఎప్పటికీ ఒక శంకరాభరణం
క్రిష్ అంటే .. మట్టికి, మనిషికి ఉన్న సంబంధం
రాజమౌళి అంటే.. తిప్పరా మీసం
ఇలా వీరు తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పారని ప్రశంసించారు. మరి మీ గురించి ఏమనుకుంటున్నారు అని యాంకర్ అడగ్గా.. అందుకు ఆయన ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. తానొక చీమని అనీ.. ఎప్పుడూ ఒక బియ్యపు గింజనో.. పంచదార పలుకునో మోసుకుంటూ ఎవరికైనా పెట్టడానికి చూస్తుంటాడు అని చెప్పారు. ఎంతైనా రైటర్ కదా..!