లావణ్య త్రిపాఠీకి ఊహించని కాంప్లిమెంట్
on Aug 9, 2016
యంగ్ హీరోయిన్లలో బిజీగా ఉన్న కథానాయిక లావణ్య త్రిపాఠీ. అటు నాగార్జున లాంటి టాప్ స్టార్లతోనూ సినిమాలు చేస్తోంది.. ఇటు అల్లు శిరీష్‌లాంటి అప్ కమింగ్ హీరోలతోనూ జోడీ కడుతోంది. ఎవరితో సినిమా చేసినా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఇటీవల విడుదలైన 'శ్రీరస్తు- శుభమస్తు' చిత్రానికీ ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాతో లావణ్యకు ఊహించని కాంప్లిమెంట్ దక్కింది. అదీ.. అల్లు అర్జున్ శ్రీమతి స్నేహా రెడ్డి ద్వారా. స్నేహకు సాధారణంగా కథానాయికలు పెద్దగా నచ్చరట. కానీ లావణ్య త్రిపాఠీ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని బన్నీనే చెప్పుకొచ్చాడు. ''సాధారణంగా స్నేహా.. టాలీవుడ్ కథానాయికల్ని పెద్దగా ఇష్టపడదు. కానీ లావణ్య అంటే అభిమానం. ఇప్పటి వరకూ తాను నాతో కలసి నటించలేదు కదా.. కాబట్టి తనపై ఎలాంటి జెలసీ లేకుండా ఇష్టపడిందేమో'' అంటున్నాడు బన్నీ. గీతా ఆర్ట్స్‌లో లావణ్య చేసిన రెండో సినిమా ఇది. రెండింటికీ మంచి ఫలితమే వచ్చింది. రెండు హిట్స్ ఇచ్చిన లావణ్యను గీతా ఆర్ట్స్ అంత తేలికగా వదులుకోకపోవొచ్చు. బన్నీ తదుపరి సినిమా కోసం కథానాయికగా లావణ్య పేరుని పరిశీలించినా, ఆమెను ఎంచుకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదేమో??