ఈ హీరోయిన్స్ తోనే రాజ్ తరుణ్ కి ఎఫైర్స్.. లిస్ట్ విడుదల
on Jul 8, 2024
ఒక హీరో ఎన్ని సినిమాలు చేసాడు. ఎంత బాగా నటించాడు. ఆ సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయి. ఎన్ని రికార్డులు నెలకొల్పాయి. ఎన్ని కలెక్షన్స్ ని సాధించాయి. ఈ విధంగా హీరో స్టామినా గురించి చెప్పుకుంటారు. కాకపోతే ఇందుకు భిన్నంగా హీరో రాజ్ తరుణ్ (raj tarun)రికార్డు లిస్ట్ ఒకటి బయటకి వచ్చింది. ఇప్పుడు ఆ లిస్ట్ సోషల్ మీడియాకి మంచి బూస్టప్ ని ఇస్తున్నాయి.
లావణ్య(lavanya)ప్రెజంట్ ఒక టాప్ హీరోయిన్ రేంజ్ లో ఈ పేరు తెలుగు నాట మారుమోగిపోతుంది. ఇందుకు కారణం రాజ్ తరుణే. కొన్ని రోజుల క్రితం లావణ్య మీడియా ముందుకొచ్చింది. రాజ్ తరుణ్ నాతో పదకొండేళ్ళుగా సహజీవనం చేసాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఆరోపించింది. ఏకంగా పోలీసు కేసు కూడా పెట్టింది. ఇప్పుడు అమ్మాయితో కాదు అమ్మాయిలతో తిరుగుతున్నాడని చెప్తుంది. చెప్పడమే కాదు సదరు లిస్ట్ ని కూడా వెల్లడి చేసింది. ఫస్ట్ లవర్ సినిమా రిద్ధి తో ఎఫైర్ కొనసాగించాడు. నాకు ఈ విషయం ఆరునెలల తర్వాత తెలియడంతో రిద్ధి కి ఫోన్ చేసి చెప్పాను. దాంతో ఆమె రాజ్ రిలేషన్ నుంచి తప్పుకుంది. ఇద్దరి లోకం ఒక్కటే హీరోయిన్ షాలిని తో కూడా కొన్నాళ్ళు తిరిగాడు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ తో కూడా సంబంధం ఉంది. ఈ ఇద్దరు కలిసి సినిమాల్లో చెయ్యకపోయినా కేవలం ఒక్క రోజు చిన్న షూట్ జరిగింది. ఆ టైం లో నేను చెన్నై లో ఒక కోర్స్ నేర్చుకుంటు ఉన్నాను. మేనేజర్ రాజా రవీంద్ర ఫోన్ చేసి విషయం చెప్పడంతో హైదరాబాద్ వచ్చేసాను. కాకపోతే వాళ్ళతో రిలేషన్ కొనసాగించినా కూడా రాజ్ నా వాడే అని అనుకుంటూ వచ్చాను.
కానీ ఎప్పుడైతే రాజ్ లైఫ్ లోకి మాల్వి మల్హోత్రా (malvi malhotra)ఎంటర్ అయ్యిందో, రాజ్ ఇక నాకు దక్కడు అని అర్ధమయ్యింది. మాల్వి కోసం రోజుకు డెబ్భై వేలు ఖర్చు చేస్తున్నాడు. కానీ పదకొండు ఏళ్లుగా సహజీవనం చేస్తున్న నాకు ఇల్లు గడవడానికి డబ్బులు కూడా ఇవ్వలేదు. అదే విధంగా రాజ్ కి చెందిన పదకొండు కుక్కలు నా దగ్గరే ఉన్నాయి. వాటి ఆలనా పాలనా కి కూడా డబ్బులు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది. మరికొంత మంది హీరోయిన్లతో కూడా రాజ్ కి సంబంధం ఉందని వాళ్ళ పేర్లు గుర్తుకు రావడంలేదని చెప్పింది. ఇక మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ కలిసి తిరగబడరా సామి లో చేసారు. త్వరలోనే మూవీ విడుదలకి కానుంది.
Also Read