'భోళా శంకర్' జోరు మాములుగా లేదుగా!
on Dec 8, 2021
.webp)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భోళా శంకర్'. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ గత నెలలో లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
'భోళా శంకర్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసి, రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేశామని తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. మొదటి షెడ్యూల్ లో ఒక స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్ తో పాటు, భారీ సెట్ లో ఓ సాంగ్ ని కూడా చిత్రీకరించామని తెలిపింది. అంతేకాదు, ఇప్పటికే సెకండ్ షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేసామని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలను బట్టి చూస్తే.. షూటింగ్ పూర్తయిన సాంగ్ శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ అందించాడని అర్థమవుతోంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న 'భోళా శంకర్' మూవీలో చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



