Home

»

Latest News

గ‌తేడాది గోపీచంద్.. ఈ ఏడాది క‌ళ్యాణ్ కృష్ణ‌!

Jan 13, 2022 2:38PM

`సోగ్గాడే చిన్ని నాయ‌నా`, `రారండోయ్ వేడుక చూద్దాం`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌. అయితే, అత‌ని మూడో చిత్రంగా వ‌చ్చిన `నేల టిక్కెట్టు` నేల చూపులు చూసి.. క‌ళ్యాణ్ ని ట్రాక్ త‌ప్పేలా చేసింది. దీంతో.. మూడేళ్ళ‌కు పైగా గ్యాప్ త‌ప్ప‌లేదు క‌ళ్యాణ్ కృష్ణ‌కి. ఈ నేప‌థ్యంలో.. త‌న ల‌క్కీ స్టార్స్ కింగ్ నాగార్జున‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ లో `బంగార్రాజు` చిత్రం తీశాడు. 2016 నాటి సంక్రాంతి విజేత `సోగ్గాడే చిన్ని నాయ‌నా`కి కొన‌సాగింపుగా రూపొందిన ఈ సినిమా కూడా పొంగ‌ల్ స్పెష‌ల్ గానే ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. రేపు (జ‌న‌వ‌రి 14) ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌త ఏడాది సంక్రాంతికి క‌ళ్యాణ్ కృష్ణ లాగే ట్రాక్ త‌ప్పిన టాలెంటెడ్ కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. `బ‌లుపు` త‌రువాత స‌రైన విజ‌యం లేని త‌న‌కి `క్రాక్` రూపంలో ఘ‌న‌విజ‌యం ద‌క్కింది. అంతేకాదు.. త‌న‌ని స్టార్ డైరెక్ట‌ర్ గా నిలిపింది. ఇప్పుడు క‌ళ్యాణ్ కృష్ణ రూపొందించిన `బంగార్రాజు` ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే.. ప‌ల్లెటూరు నేప‌థ్యంలో తీసిన ఈ సినిమా సంక్రాంతి విజేత అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోందంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి.. గ‌తేడాది సంక్రాంతికి గోపీచంద్ `క్రాక్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చిన‌ట్టే.. ఈ సంవ‌త్స‌రం పొంగ‌ల్ కి క‌ళ్యాణ్ కృష్ణ కూడా `బంగార్రాజు`తో మ‌రోసారి స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com