ముచ్చటగా మూడోసారి కలవనున్న జంటలు
on Sep 11, 2013
వెంకటేష్, రామ్ చరణ్, కృష్ణ కలిసి త్వరలోనే ఓ మల్టీ స్టారర్ చిత్రం తెరకేక్కబోతున్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కాజల్, వెంకటేష్ సరసన నయనతార నటించే అవకాశాలున్నట్లు తెలిసింది. అంటే "మగధీర", "నాయక్" చిత్రాల తర్వాత చరణ్-కాజల్, అదే విధంగా "లక్ష్మీ", "తులసి" చిత్రాల తర్వాత వెంకీ-నయనతార లు మళ్ళీ జోడిగా నటించనున్నారన్నమాట.
అయితే గతకొద్ది కాలంగా ప్లాపులు తప్ప హిట్లు లేని కృష్ణవంశీ.. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఆశిస్తున్నాడట. అదే విధంగా చరణ్ నటించిన "తుఫాన్"చిత్రం అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో ఎలాగైనా ఈ మల్టీ స్టారర్ చిత్రంతో మళ్ళీ హిట్టు కొట్టాలని ఆశిస్తున్నాడు. మరి వీళ్ళందరి ఆశలు నెరవేరుతాయో లేదో త్వరలోనే తెలియనుంది.