మనసున్నోడు కరణ్..శ్వేతాకు హీరోయిన్గా ఛాన్స్
on Apr 16, 2016
కొత్తబంగారులోకం..రైడ్ తదితర సినిమాలతో తెలుగులో మంచి హీరోయిన్గా మార్కులు సంపాదించుకున్న నటి శ్వేతాబసు. చేతిలో సినిమాలు లేకపోవడంతో ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం సంచలనం సృష్టించింది. ఆ తరువాత ఆ కేసులోంచి బయటపడిన శ్వేతా ఓ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా సై అంది. మళ్లీ ఆ తర్వాత ఎలాంటి ఆఫర్లు లేకపోవడంతో ఆల్మోస్ట్ ఫేడవుట్ అయ్యే స్టేజ్లో ఉంది. అయితే కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్. తన డైరెక్షన్లో రూపొందనున్న మూవీలో లీడ్ రోల్ చేయడానికి శ్వేతాను సెలెక్ట్ చేశాడు కరణ్. అయితే ఇందులో ఎలాంటి పాత్ర చేయబోతుందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఆఫర్ ద్వారా తనెంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది శ్వేతా. మొత్తానికి ఈ భామకు మంచి రోజులు మళ్లీ వచ్చినట్టే.