శ్రీలంకకి వెళ్లిన విజయ్ దేవరకొండ..కారణం ఇదే
on Mar 24, 2025
స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)గత కొంత కాలంగా వరుస పరాజయాల్నిచవి చూస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో 'కింగ్ డమ్' అనే యాక్షన్ థ్రిల్లర్ తో మే 30 న థియేటర్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఒక లెవల్లో ఉండటంతో కింగ్ డమ్(KIngdom)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
చిత్ర యూనిట్ రీసెంట్ గా మన పొరుగుదేశం శ్రీలంక(Srilanka)లో అడుగుపెట్టింది.ఈ రోజు నుంచి శ్రీలంక లోని వివిధ లొకేషన్స్ లో విజయ్ దేవరకొండ,హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(BHagyashri Borse)పై ఒక లవ్ సాంగ్ ని చిత్రీకరించనున్నారు.వారం రోజులు పాటు జరిగే శ్రీలంక షెడ్యూల్ తో మూవీ దాదాపుగా పూర్తయినట్టే అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ విజయ్ దేవర కొండ కెరీర్ లోనే కింగ్ డమ్ ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నలూరి(Gowtham Tinnanuri)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.సత్యదేవ్(satyadev)కీలక పాత్రలో కనిపిస్తుండగా అనిరుద్(Anirudh Ravichander) సంగీతాన్ని,గిరీష్ గంగాధరన్, జోమన్ టి జాన్ ఫొటోగ్రఫీ బాధ్యతలని నిర్వహిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
