నాని ని క్రాస్ చేసిన విజయ్ దేవరకొండ
on Jul 29, 2025

గత కొంత కాలంగా వరుస పరాజయాలని చవి చూస్తున్న 'విజయ్ దేవరకొండ'(Vijay Devarakonda)ఈ నెల 31 న 'కింగ్ డమ్'(King Dom)తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కింగ్ డమ్ కి 'జెర్సీ' ఫేమ్ 'గౌతమ్ తిన్ననూరి'((Gowtam Tinnanuri)దర్శకుడు. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్(Hyderabad)లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా నార్త్ అమెరికాలోని అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. 248 లొకేషన్స్ లో 578 షోస్ కి గాను 15228 టికెట్స్ బుక్ అవ్వగా 260875 డాలర్స్ వసూలు చేసింది. నాచురల్ స్టార్ 'నాని' ప్రీవియస్ మూవీ హిట్ 3 356 లొకేషన్స్ లో 930 షోస్ కి గాను 13184 టికెట్స్ తో 260875 డాలర్స్ ని వసూలు చేసింది.
కింగ్ డమ్ లో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే జత కట్టగా, సత్యదేవ్, కౌశిక్ మెహతా, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవి చందర్ (Anirudh Ravichander)సంగీతాన్ని అందించాడు. ట్రైలర్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కింగ్ డమ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



