జూన్ లో కొత్త సినిమాలోకి ఎంటరవుతున్న కింగ్..!
on Apr 21, 2016

హ్యాట్రిక్ హిట్స్ తో ఈ మధ్య కాలంలో ఎవరికీ సాధ్యం కాని విజయాన్ని సొంతం చేసుకున్నారు కింగ్ నాగార్జున. కొత్త తరహా కథల్ని ఎంచుకుంటూ కుర్రాళ్లకు మార్గదర్శకంగా మారిపోయారు. చివరిగా చేసిన మూడు సినిమాలూ 40 కోట్ల క్లబ్బును దాటేశాయి. సినిమా సినిమాకూ సంబంధం లేకుండా కథల్ని ఎంచుకుంటున్న నాగ్, ఇప్పుడు భక్తి జానర్లోకి మారిపోయారు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథీరాం బాబా సినిమాను నాగ్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను రాఘవేంద్రరావు పూర్తి చేసే పనిలో ఉన్నారు. జూన్ నెల వచ్చేసరికి, మూవీ సెట్స్ పైకి చేరుకోనుంది. రాఘవేంద్రరావు నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి లాంటి భక్తి రస ప్రథాన చిత్రాలు వచ్చాయి. తర్వాత రాబోతున్న హాథీరాం బాబా కథ కూడా ఈ కోవలోకే చేరుతుంది. ఈ సినిమాకు ఓం నమో వేంకటేశాయ అనే పేరును అనుకుంటున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



