Home

»

Latest News

పాన్ ఇండియా మూవీ 'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ వచ్చేసింది!

Dec 7, 2021 2:24PM

కన్నడ స్టార్ సుదీప్‌ హీరోగా నటిస్తోన్న మూవీ ‘విక్రాంత్‌ రోణ’. ఈ సినిమాకి అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘విక్రాంత్‌ రోణ’ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు.

‘విక్రాంత్‌ రోణ’ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 24 న విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో బైక్ పై కూర్చొని ఉన్న సుదీప్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళంతో పాటు పలు విదేశీ భాషల్లో విడుదల కానుంది. ఫిబ్రవరి 24 న ప్ర‌పంచానికి విక్రాంత్ రోణ అనే కొత్త హీరో ప‌రిచ‌యమ‌వుతున్నాడు అంటూ మేకర్స్ భారీస్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

షాలినీ ఆర్ట్స్ బ్యానర్ పై  జాన్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com