ఖుష్భు ఇంజక్షన్స్ చేయించుకుందా! వాళ్ళ తల్లితండ్రుల్ని చూస్తే జాలేస్తుంది
on Apr 16, 2025
మాజీ హీరోయిన్ ఖుష్భు(Khushbu)సినీ జర్నీ చాలా ఘనమైనది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి సుమారు 185 సినిమాల దాకా చేసింది. ఇందులో తమిళంలోనే 100 సినిమాలకి పైగానే చేసింది. అక్కడి ఫ్యాన్స్ అయితే ఖుష్బు పేరున ఒక గుడి కూడా కట్టారంటే ఆమె సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో కూడా సుమారు 20 చిత్రాల దాకా హీరోయిన్ గా చెయ్యగా, మరికొన్ని చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను చేసింది. చివరగా గోపిచంద్(Gopichandh)హీరోగా 2023 లో వచ్చిన రామబాణం మూవీలో కనపడగా పలు టీవీ షోస్ కి జడ్జి గాను వ్యవహరిస్తోంది.
ఖుష్భు రీసెంట్ గా తన కొత్త పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తు బ్యాక్ టూ ది ఫ్యూచర్ అనే క్యాప్షన్ ఉంచింది. ఎంతో కాలం నుంచి లావుగా ఉంటూ వస్తున్న ఆమె సదరు పిక్స్ లో సన్నగా స్లిమ్ అయినట్టుగా ఉంది. దీంతో కొంత మంది ఆమెని ప్రశంసిస్తుంటే మరికొంత మంది నెటిజన్స్ మాత్రం ఇంజక్షన్స్ చేయించుకోవడం వల్లనే మీరు సన్నగా మారిపోయారు. వాటి మ్యాజిక్ ఏంటో మీ ఫాలోవర్స్ కి కూడా చెప్పండంటు ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రోలర్స్ కి ఖుష్భు తనదైన స్టైల్లో జవాబు రిప్లై ఇస్తు 'మీరెప్పుడు సోషల్ మీడియాలో ముఖాలు చూపించరు. ఎందుకంటే మీరంతా అసహ్యంగా ఉంటారు. మీతల్లితండ్రులని చూస్తుంటే జాలి వేస్తుందంటు కౌంటర్స్ ఇస్తుంది. ఖుష్భు సుదీర్ఘ కాలం నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు వస్తున్న విషయం తెలిసిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
