ప్రముఖ నటిపై లైంగిక దాడి.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు...
on Dec 8, 2025

ఎనిమిదేళ్ల క్రితం మలయాళ నటిపై లైంగిక దాడి కేసు కేరళలో సంచలనం సృష్టించింది. 2017 లో ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసికుంది. నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్ ను కేరళలోని ఎర్నాకుళం కోర్టు సోమవారం నిర్దోషిగా తేల్చింది.
సౌత్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఓ ప్రముఖ నటి.. 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్ కి గురైంది. కొచ్చిలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఆమెను తన కారులోనే లైంగిక వేధింపులకు గురిచేసిన దుండగులు.. తర్వాత అక్కడినుంచి పారిపోయారు.
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో పది మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో దిలీప్ కూడా ఒకరు. 2017 జులైలో అరెస్టయిన దిలీప్.. నాలుగు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ మొదటినుంచి వాదిస్తున్నాడు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా.. సీబీఐ దర్యాప్తుకి కూడా దిలీప్ డిమాండ్ చేశాడు. అయితే ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది.
అయితే ఇన్నేళ్ళకు ఈ కేసులో దిలీప్ ను ఎర్నాకుళం కోర్టు నిర్దోషిగా తేల్చింది. తాజా కోర్టు తీర్పుపై దిలీప్ స్పందించాడు. ఇది తనపై జరిగిన కుట్ర అని, ఇన్నేళ్ళుగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



