నవంబర్ లో కీర్తి డబుల్ ధమాకా!
on Oct 18, 2021
అభినయానికి ఆస్కారమున్న పాత్రలకు చిరునామాగా నిలిచే కథానాయికల్లో కేరళకుట్టి కీర్తి సురేశ్ ఒకరు. మూడేళ్ళ క్రితం `మహానటి`గా మురిపించిన కీర్తి.. ఆపై ఇటు తెలుగు, అటు తమిళంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు చేసినా ఆశించిన విజయాలు దక్కలేదు. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ప్రస్తుతం కీర్తి చేతిలో `అణ్ణాత్త`, `సర్కారు వారి పాట`, `భోళా శంకర్` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో పాటు `గుడ్ లక్ సఖి`, `దసరా`, `సాని కాయిదమ్`(తమిళ్) వంటి మీడియం రేంజ్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. మార్చిలో `జాతిరత్నాలు` (అతిథి పాత్ర), `రంగ్ దే` చిత్రాలతో డబుల్ ధమాకా ఇచ్చిన కీర్తి సురేశ్.. నవంబర్ లోనూ అదే బాట పట్టనుంది. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కి చెల్లెలిగా కీర్తి నటించిన `అణ్ణాత్త` (తెలుగులో `పెద్దన్న` పేరుతో అనువాదం కానుంది) దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ కానుండగా.. అదే నెలలో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `గుడ్ లక్ సఖి` రిలీజ్ కాబోతోంది. మరి.. ఈ రెండు సినిమాలతో కీర్తి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.
Also Read