హీరోతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నారు కదా
on Jan 29, 2026

-అభిమానులకి షాక్ ఇచ్చిన కీర్తి భట్
-హీరో నిజంగా హీరో కాదా!
-కారణం ఏమై ఉంటుంది
-మీ ప్రేమ కావాలంటున్న కీర్తి భట్
ప్రముఖ హీరో విజయ్ కార్తీక్(Vijay Karthik)సీరియల్ నటి కీర్తి భట్(keerthi Bhat)లు సోషల్ మీడియా వేదికగా ఒకరి కోసం ఒకరం పుట్టాము అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు వివాహ బంధంతో తమ నూరేళ్ళ బంధాన్ని కొనసాగించాలని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. కానీ కీర్తి భట్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక పోస్ట్ అభిమానులని షాకింగ్ కి గురి చేస్తుంది. మరి కీర్తి భట్ పోస్ట్ లో ఏముందో చూద్దాం.
నేను క్లియర్ గా హానెస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. నా జీవితంలోని రీసెంట్ రిలేషన్ ముగింపు దశకి వచ్చేసింది. ఇది చాలా కాలంగా ఉంది. నిజంగా ఉంది. కానీ ఆ బంధం ఎప్పుడూ జీవిత భాగస్వామి లేదా భర్తగా మారినట్టు అనిపించలేదు. మేమిద్దరం ఫ్రెండ్స్ గా మాత్రం ఉంటాం. నా డెజిషన్ ఎవర్నైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. జీవితం అనేది ఇప్పుడు యుద్ధం. దాంట్లో స్ట్రాంగ్ గా డిగ్నిఫైడ్ గా నిలబడతాను. కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని కాకుండా సంతోషానికి ఇంపార్టెన్స్ ఇచ్చే పెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్నాను. అభిమానులు ఎప్పుడు నాపై ప్రేమని చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియచేసింది.
Also Read: రజినీకాంత్ బయోగ్రఫీ మూవీకి గ్రీన్ సిగ్నల్.. హీరో ఇతనే
మానసిచ్చిచూడు, కార్తీక దీపం , బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా కీర్తి బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇక విజయ్ కార్తీక్ కొరియోగ్రాఫర్‌గా పలు కన్నడ సినిమాలకి పని చేసిన అనంతరం కన్నడలోనే మెలోడీ' అనే మూవీతో నటుడుగా పరిచమయ్యాడు. ఆ తరువాత ‘సేడు’ తో హీరోగా పరిచయం అయ్యారు. కేజీఎఫ్ సినిమా విడుదలకు ఒకరోజు ముందుగా సేడు విడుదల కావడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏబీ పాజిటివ్' అనే మూవీకి డైరెక్షన్ కూడా చేసాడు. మరి అటువంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ ఇద్దరు ఎన్నో రోజులు లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితమే ఈ ఇద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



