కత్తి - పవన్ ఫ్యాన్ సయోధ్యకు కారణం ఆ హీరోనే?
on Jan 22, 2018

నాలుగు నెలల పాటు టీవీల్లో విరామం లేకుండా కొట్టుకున్నారు. తిట్టుకున్నారు. విసిగించారు. చిరాకు పుట్టించారు. ఇప్పుడు ఉన్నట్టుండి చప్పున సైలెంట్ అయిపోయారు. అసలేం జరిగింది? అసలు మతలబు ఏంటి? ముట్టుకుంటే కాలేలా ఉన్న కత్తి మహేశ్ ఉన్నట్టుంచి చప్పున చల్లారిపోవడానికి కారణం ఏంటి? మనోడికి బెరిదించారా? లేక డబ్బు ముట్టిందా? లేక ఒక్కడ్నే ఏం పోరాడతాలే అని కత్తి మహేశే చేతులెత్తేశాడా? ఇలా ఒక అనుమానం కాదు.
అయితే...ఈ వ్యవహారంపై ఓ వార్త షికార్లు చేస్తోంది. వివరాల్లోకెళ్తే... కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య వాగ్వివాదాలు...కోడి గుడ్లతో కొట్టుకునే దాకా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఉన్నట్టుండి కత్తి మహేశ్ చల్ల బడ్డాడు. అందరూ కలిసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ పరిణామానికి కారణం ఓ స్టార్ హీరో అని తెలుస్తుంది. కత్తి మహేశ్ కీ , పవన్ అభిమానులకూ మధ్య రాజీ కుదిర్చింది ఆ స్టార్ హీరోనే అని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? అనేది మాత్రం ఇక్కడ సస్పెన్స్.
మొదట ఈ వ్యవహారాన్ని రాజీ కుదర్చడానికి కోన వెంకట్ ప్రయత్నం చేశాడు. జనవరి 15న తర్వాత అన్నీ సద్దు మణుగుతాయ్ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అయితే... ఆ తర్వాత కోన కూడా చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
అయితే... నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ స్టార్ హీరో.. ఈ వ్యవహారం ముదిరితే.. పవన్ కెరీర్ కే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గమనించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిని మధ్య వర్తిగా కూర్చోబెట్టి... పవన్ ఫ్యాన్స్, కత్తి మహేశ్ ల మధ్య సయోధ్య కుదిర్చారట.
అసలు ఆ రాష్ట్రమంత్రి ఎవరు? ఆ స్టార్ హీరో ఎవరు? ఉన్నట్టుండి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆ స్టార్ హీరోకు ఎందుకొచ్చింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



