కస్తూరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..బ్రాహ్మణేతర ఉద్యోగుల్ని తిట్టిందంటూ మరో కేసు
on Nov 20, 2024
తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి(kasthuri)పై కేసులు నమోదయిన దృష్ట్యా,పరారిలో ఉన్న కస్తూరిని కొన్ని రోజుల క్రితం చెన్నై పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నోరు అదుపులో ఉంచుకోవాలని ఎగ్మోర్ కోర్టు చివాట్లు పెట్టడమే కాకుండా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. దాంతో అప్పట్నుంచి కస్తూరి జైలు జీవితం గడుపుతూ ఉంది.
ఇక కస్తూరి రీసెంట్ గా తన కుమారుడు అటిజంతో బాధపడుతున్నాడని,వయసుపై బడిన తల్లిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎగ్మోర్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది.దీంతో విచారణ చేసిన కోర్టు కస్తూరి కి బెయిల్ మంజూరు చెయ్యడంతో ఈ రోజు ఆమె జైలు నుంచి విడుదల కానుంది.
ఇక బ్రాహ్మణేతర ఉద్యోగులపై కూడా కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని, చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.మరి ఈ వ్యాఖ్యలు ఆమె ఎప్పుడు చేసిందనే విషయం బయటకి రావాల్సి ఉంది.
Also Read