మలయాళ భామలతో తెలుగు హీరోలు రొమాన్స్!!
on Jun 28, 2019
మలయాళ ముద్దుగుమ్మలకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దశాబ్దం క్రితం తెలుగులో ఓ ఊపు ఊపిన అసిన్, నయనతార, ప్రియమణి వంటివారందరూ మల్లువుడ్ భామలే. ఇప్పుడు టాప్ హీరోలతో్ జతకడుతోన్న నిత్యామీనన్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, ప్రియా పి వారియర్... ఓపిగ్గా తెలుసుకోవాలేగానీ, ఈ లిస్టు చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది. ఈ లిస్ట్ లో యాడ్ ఆన్ అవుతున్నారు మరో మలబారు బ్యూటీ. ఆమె పేరు అనఘ. `ఆర్.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ సరసన `గుణ 369`లో అనఘ జోడీ కడుతున్నారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `గుణ 369`. కార్తికేయ హీరోగా నటించారు. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. అర్జున్ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన టీజర్లో హీరోయిన్ని చూసినప్పటి నుంచి చాలా మంది ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఆమె పేరు అనఘ. కేరళ భామ. మలయాళ నటీమణులకు మన దగ్గర ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అనఘ కూడా టాప్ రేంజ్కి వెళ్తుందనే నమ్మకం ఉంది. తమిళ చిత్రం `నట్పే తునై`లో అనఘ నటించారు. అందులో కొన్ని సీన్లు చూసి ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నారు.