కాశ్మోరా సినిమాలో కార్తీ కొత్త తరహా పాత్ర..!
on May 6, 2016
కాశ్మోరా అనే పేరుతో తెలుగువారికి కొత్తగా పరిచయం అవసరం లేదు. తులసీదళం సీరియల్ ద్వారా ఈ కాశ్మోరా అనే పేరు చాలా భయపెట్టింది. తాజాగా రౌద్రం ఫేమ్ గోకుల్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఇదే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ గా ఈ సినిమా ఉండబోతోంది. ఇలాంటి మూవీస్ లో గ్రాఫిక్స్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే రీసెంట్ గా కార్తీ ముఖాన్ని 3డి స్కాన్ చేశారు స్పెషల్ ఎఫెక్ట్స్ టీం. మూవీలో కార్తీ మూడు రకాల పాత్రలో కనిపిస్తాడని, ఒక పాత్రకు కార్తీ స్కాన్ చేసిన ముఖాన్ని ఉపయోగిస్తారని అంటున్నారు. గతంలో రజనీ కొచ్చాడయాన్ సినిమాకు కూడా ఇలాగే బాడీ స్కాన్ ను చేశారు. కానీ అది కంప్లీట్ మోషన్ కాప్చర్ సినిమా. కార్తీ సినిమా రెగులర్ హర్రర్ సినిమాయే అయినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ కోసం అతన్ని స్కాన్ చేశారంటోంది మూవీ టీం. కాశ్మోరాలో కార్తీ సరసన నయనతార, శ్రీవిద్య నటిస్తున్నారు. మే 25 న కార్తీ పుట్టిన రోజు సందర్భంగా, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు 16 సెట్స్ ను నిర్మించడం విశేషం.