కాష్మోరాను కట్ చేశారు
on Oct 27, 2016

మన తాతలు, తండ్రుల కాలంలో సినిమా అంటే మినిమమ్ మూడు గంటలు తక్కువ ఉండేది కాదు. కాని కాలం మారింది మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కూర్చోబెట్టే మ్యాజిక్ డైరెక్టర్ల దగ్గరా కరువవుతోంది...అంతకు మించి జనానికి టైము ఉండటం లేదు. అందుకే ఇప్పుడు సినిమాల యావరేజ్ లెంగ్త్ రెండుంబావు గంటలు..మహా అయితే రెండున్నర గంటలు. ఇలాంటి సమయంలో మూడు గంటలకు పావు గంట తక్కువ లెంగ్త్‌తో కాష్మోరా చిత్రం రెడీ అయ్యింది. కార్తీ, నయనతార, శ్రీదివ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. సినిమా లెంగ్త్ విషయంలో ముందు నుంచి టెన్షన్‌గా ఉన్న చిత్ర యూనిట్..సినిమా రిలీజై జనం నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత మేల్కోనేకంటే ముందుగానే మేల్కోంటే అన్నిటికి మంచిదని ఫిక్సైంది. అందుకే 12 నిమిషాలు కట్ చేసి నిడివిని 2 గంటల 32 నిమిషాలకు తగ్గించేశారు. సినిమా స్పెషల్ ఎట్రాక్షన్‌గా భావిస్తోన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని టచ్ చేయకుండా అనవసర సన్నివేశాలు కట్ చేసినట్లు టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



