Home

»

Latest News

karan johar: కరణ్ జోహార్ భావోద్వేగం..ఆదిత్య చోప్రా, షారుఖ్ ఖాన్‌పై వ్యాఖ్యలు వైరల్ 

Jul 29, 2026 7:15PM

 

ప్రేమ సినిమాలకి భారతీయ చిత్ర పరిశ్రమలో మరణమనేది లేకుండా చేసిన మూవీ  దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే. ఈ చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరణ్ జోహార్ ఆ తర్వాత దర్శకుడిగా మారి, ఇప్పుడు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా తన హవా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ రోజు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని  సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు.

నేను  ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి, చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడానికి ఇద్దరు వ్యక్తులకి  కృతజ్ఞతలు చెప్పాలి. వారే ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత  ఆదిత్య చోప్రా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. జీవితంలో మొదటి మలుపు అర్ధరాత్రి 1 గంటకు  చోటుచేసుకుంది. ఆ సమయంలో  విదేశాలకు వెళ్ళి తన ఉన్నత చదువులను కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. సరిగ్గా అదే సమయంలో ఆదిత్య చోప్రా ఫోన్ చేశారు. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' (DDLJ) చిత్రానికి సహాయ దర్శకుడిగా (అసిస్టెంట్ డైరెక్టర్) పనిచేయమని ఆదిత్య చోప్రా కోరారు. నీలో ఒక గొప్ప దర్శకుడి లక్షణాలు ఉన్నాయని, సినిమా రంగాన్ని వదిలి విదేశాలకు వెళ్తే జీవితంలో అతిపెద్ద పొరపాటు చేసినట్లవుతుందని గట్టిగా చెప్పారు. ఆ మాటలు నా గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయాన్నే నా తండ్రి, ప్రముఖ నిర్మాత యష్ జోహార్ వద్దకు వెళ్లాను. సరిగ్గా ఒక సంవత్సరం కాలం సినిమా సెట్స్‌పై గడపడానికి అనుమతి ఇవ్వాలని అడిగాను.

దాంతో మా నాన్న 'బేటా... ఒక సినిమా సెట్‌పై ఏమి చేయాలో నీకు పూర్తిగా తెలుసా?" అని అడిగారు. దానికి  లేదు" అని బదులిచ్చాని . "మరి చెప్పిన ప్రతి పనినీ ఎంతో కష్టపడి చేస్తానని మాట ఇస్తావా?" అని అడగ్గా,  "ఖచ్చితంగా ఇస్తాను" అన్నాను . అప్పుడు నాన్న చిరునవ్వుతో, "అలా కష్టపడి పనిచేస్తే నువ్వు ఒక మంచి నిర్మాతవుతావు... కానీ ఒక గొప్ప దర్శకుడు కావాలంటే నీకు కావాల్సింది కేవలం అమితమైన ఆశయం, సినిమా పట్ల తీవ్రమైన మక్కువ (Passion) మాత్రమే" అని చెప్పాడు.

Also read: చెన్నైలవ్ స్టోరీ దర్శకుడు రవి ఎవరు.. వైరల్ అవుతున్న న్యూస్ 


 రెండవ మలుపు స్విట్జర్లాండ్‌లోని మంచు కొండలపై DDLJ షూటింగ్ సమయంలో జరిగింది. అక్కడ పర్వతాల అందాలను చూస్తూ ఉన్న నా వద్దకు షారుఖ్ ఖాన్ వచ్చి నిలబడ్డారు. "నువ్వు ఖచ్చితంగా ఒక గొప్ప డైరెక్టర్ అవుతావు, నీ మొదటి సినిమా నేనే చేస్తాను" అని షారుఖ్ చెప్పారు. మొదట షారుఖ్ చమత్కారంగా అంటున్నారేమోనని భావించినప్పటికీ, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత షారుఖ్ తన మాటని  నిలబెట్టుకున్నారు. యష్ జోహార్‌తో మాట్లాడి కరణ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించారు. అలా 1998లో వచ్చిన 'కుచ్ కుచ్ హోతా హై' (Kuch Kuch Hota Hai) చిత్రంతో దర్శకుడిగా మారాను.నేను ఈ రోజు ప్రపంచానికి కథలు చెప్పడానికి ఏకైక కారణం ఆది, భాయ్ నే అంటూ తన ట్వీట్ ముగించాడు.

Karan Johar, Shah Rukh Khan, Aditya Chopra

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com