ఇదిదా సర్ ప్రైజ్.. ఆస్కార్ బరిలో కంగువా..!
on Jan 7, 2025
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'కంగువా'(kanguva). భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మూవీ టీంకి, సూర్య అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆలాంటి ఈ సినిమా ఊహించని విధంగా ఆస్కార్ బరిలో నిలవడం సంచలనంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా 323 సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్స్ కి అర్హత సాధించాయి. వాటిలో 'కంగువా' చిత్రం కూడా స్థానం సంపాదించుకుంది. 'కంగువా'తో పాటు ఇండియన్ సినిమాలలో 'ఆడుజీవితం', 'సంతోషం', 'స్వాతంత్య్ర వీర్ సావర్కర్', 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్', 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' ఆస్కార్ బరిలో నిలిచాయి. మరి వీటిలో ఫైనల్ నామినేషన్స్ కి ఏదైనా సినిమా అర్హత సాధిస్తుందేమో చూడాలి.