Home

»

Latest News

హనీమూన్ లో భర్తని చంపిన భార్య మైండ్ గురించి పూర్తిగా చెప్పేసిన కంగనా రనౌత్

Jun 10, 2025 9:10PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే  కంగనా రనౌత్(Kangana Ranaut)2006లో 'అనురాగ్ బసు'(Anurag Basu)దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ స్టర్' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన కంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. తెలుగులో కూడా 'ప్రభాస్'(Prabhas)సరసన ఏక్ నిరంజన్ అనే చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలని పొందిన కంగనా, ఈ ఏడాది జనవరిలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(Indhira Gandhi) ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన 'ఎమర్జెన్సీ' పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించి ఇందిరా గాంధీ ని మురిపించిన కంగనా ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది.
  
రీసెంట్ గా మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ ని అతని భార్య సోనమ్ తన ప్రియుడు తో కలిసి చంపిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కంగనా ఇనిస్టా వేదికగా స్పందిస్తు 'రాజా రఘువంశీ హత్య కేసు నన్ను ఎంతగానో  కదిలించింది. అసలు ఈ కేసుని  అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక మహిళ తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్ని తిరస్కరించదు. అలాంటి మహిళ ఇంత క్రూరమైన హత్యకు పథకం వేసి సుపారీ ఇవ్వగలదా. ఉదయం నుంచి ఈ విషయం నా మనసును కలచివేస్తోంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు, తలనొప్పిగా ఉంది. భర్త నుంచి  విడాకులు తీసుకొని ప్రియుడుతో పారిపోకుండా ఎంత క్రూరమైన పని చేసింది. అందుకే  మూర్ఖుల్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వారే సమాజానికి అత్యంత ప్రమాదకారులు. తెలివైన వ్యక్తులు తమ స్వార్థం కోసం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారేమో కానీ, తెలివితక్కువ వారు ఎలాంటి భయంకరమైన పనులకు పాల్పడతారో ఊహించలేం. దయచేసి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండంటూ ఇనిస్టా లో పోస్ట్ చేసింది.
 
కంగనా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరుఫున హిమాచల్ ప్రదేశ్ లోని 'మండి' లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్ మెంబర్ గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఫిజియోలాజికల్ థ్రిల్లర్ గా ఒక కొత్త మూవీని తెరకెక్కించే ఆలోచనలో కంగనా ఉంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com