డైరెక్టర్ అవుతున్న గ్రేట్ స్టంట్ డైరెక్టర్..!
on Apr 21, 2016

కణల్ కణ్ణన్. ఒకప్పుడు ఫైట్స్ అని వినిపస్తే ఈ పేరు కూడా వినబడేది. స్టంట్స్ డిజైన్ చేయడంలో కణల్ కణ్ణన్ ది అంత ప్రత్యేకమైన శైలి. దక్షిణ భారత స్టంట్ డైరెక్టర్స్ లో ఆల్ టైం టాప్ 5 లో గ్యారంటీగా ఉంటాడు. ఇప్పుడు ఈ స్టంట్ డైరెక్టర్, దర్శకుడిగా మారుతున్నాడు. కొరియోగ్రాఫర్లు, కేమేరా మన్లు, నిర్మాతలు డైరెక్టర్స్ అవుతున్నారు కాబట్టి, కణల్ కణ్ణన్ నిర్ణయంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కణల్ హీరో గోపీచంద్ కు కథ చెప్పి, ఒప్పించాడట. పూర్తి యాక్షన్ తో, మాస్ ఎంటర్ టైనర్ కథతో, గోపీని మెప్పించాడట. కథ బాగా నచ్చి గోపీచంద్ కూడా సై అనడంతో, త్వరలోనే వీళ్లిద్దరి మూవీ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందట. ప్రస్తుతం ఎఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూపొందిస్తున్న ఆక్సిజన్ సినిమాలో బిజీగా ఉన్నాడు గోపీచంద్. అది పూర్తవ్వగానే కణ్ణన్ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. గతంలో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో గోపీచంద్ రణం లాంటి సూపర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



