'కామసూత్ర' హీరోయిన్‌కు కరోనా పాజిటివ్!
on Mar 20, 2020

సంచలన చిత్రం 'కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్'లో హీరోయిన్‌గా బోల్డ్‌గా నటించి, తన అభినయంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బ్రిటిష్ ఇండియన్ యాక్టర్ ఇందిరా వర్మ కరోనా వైరస్ బారిన పడింది. బ్లాక్‌బస్టర్ టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో ఎల్లారియా శాండ్ క్యారెక్టర్‌తోనూ ఆకట్టుకున్న ఆమెకు జరిపిన కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ పరీక్షలోపాజిటివ్ వచ్చింది. గమనించాల్సిన విషయమేమంటే, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సహ నటుడు క్రిస్టఫర్ హివ్‌జుకు కరోనా వైరస్ సోకినట్లు తేలిన రెండు రోజుల తర్వాత ఇందిర కూడా దానికి గురవడం!
"దానితో (కరోనాతో) బెడ్ మీదున్నాను. నాకేమీ బాగాలేదు. సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి. తోటి మనుషులతో దయతో వ్యవహరించండి" అని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆమె పోస్ట్ చేసింది. లండన్‌లోని వెస్ట్ ఎండ్‌లో ప్రదర్శిస్తోన్న ఆంటోన్ చెహోవ్ నాటకం 'ద సీగుల్' ఆధునిక వెర్షన్‌లో నటిస్తోన్న ఇందిర, "కోవిడ్-19 మహమ్మారి కారణంగా మా నాటకంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక నాటకాలు ఆగిపోవడం బాధాకరం. త్వరలోనే మేం మళ్లీ మీ ముందుకు వస్తాం. అప్పుడు మీ అందరి సపోర్ట్ మాకు కావాలి" అని ఆకాంక్షించింది ఇందిర.
సుప్రసిద్ధ దర్శకురాలు మీరా నాయర్ రూపొందించిన 'కామసూత్ర: ద టేల్ ఆఫ్ లవ్' (1996)తో నటిగా పరిచయమైన ఇందిర, తొలి చిత్రంతోనే సంచలన తారగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 1998లో వచ్చిన 'జిన్నా' మూవీలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా రెండో భార్య రత్తన్‌బాయ్‌గా నటించింది. 'బ్రైడ్ అండ్ ప్రెజుడిస్', 'బేసిక్ ఇన్‌స్టింక్ట్ 2', 'ఎక్సోడస్: గాడ్స్ అండ్ కింగ్స్' సినిమాలు ఆమెకు మరింత పేరు తెచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



