పెళ్లిరోజు ఇంటి బయట ప్రత్యక్షమైన కాజల్!
on Oct 30, 2020
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ శుక్రవారం ఇంటీరియర్ డిజైన్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహమాడేందుకు రెడీ అవుతోంది. పెళ్లి వేడుక మరి కొద్ది గంటల్లో ఆమె తన ఇంటి వద్ద పింక్ కలర్ సల్వార్-కుర్తా డ్రస్‌లో ప్రత్యక్షమైంది. తల్లితో కలిసి నడచుకుంటూ వెళ్తుండగా కెమెరాలు క్లిక్ మన్నాయి. కరోనా మహమ్మారి భయాన్ని పక్కకు నెట్టేసి వివాహానికి ముందు జరిగే వేడుకల్లో తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాజల్ ఎంతో సరదాగా, ఆనందంగా గడుపుతున్న ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా పసుపు కుంకుమ, గోరింటాకు వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి. వేడుకలకు వస్తున్న గెస్ట్‌లకు కాజల్, ఆమె చెల్లెలు నిషా ఆహ్వానం పలుకుతున్న కొత్త వీడియో ఒకటి ప్రత్యక్షమైంది. అతిథులు నడుచుకుంటూ వస్తుండగా ధోల్ మ్యూజిక్కు అనుగుణంగా వారు డాన్స్ చేస్తున్నారు. పసుపు రంగు కుర్తా, సల్వార్‌లో కాజల్ మెరిసిపోతుండగా, పింక్ కలర్ డ్రస్‌లో, కొడుకును ఎత్తుకొని నిషా కనిపిస్తోంది. పాపులర్ పంజాబీ సాంగ్ 'సోనా సోనా' ప్లే అవుతుండగా అందరూ ఆ పాటను ఆస్వాదిస్తున్నారు.
కాగా, శుక్రవారం ఉదయం తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పసుపు కుంకుమ వేడుకకు సంబంధించిన ఒక స్టన్నింగ్ పిక్చర్‌ను షేర్ చేసింది కాజల్. టాప్ యాంగిల్ నుంచి తీసిన ఆ పిక్చర్లో అమ్మలక్కలు కాజల్ ముఖానికి పసుపు రాస్తుండగా, కాజల్ దాన్ని ఆస్వాదిస్తోంది. దానికి వెడ్డింగ్ హ్యాష్‌ట్యాగ్ #kajgautkitched ను క్యాప్షన్‌గా ఉపయోగించింది.
Also Read