సాహో తో కాజల్ డార్లింగ్!!
on Mar 25, 2019
మిస్టర్ ఫర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాలలో ప్రభాస్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుటయింది. అయితే తాజాగా వీరిద్దరు కలిసి మరోమారు నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఆ వివారల్లోకి వెళితే...`జిల్` ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ యూరప్ లో పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఒక కీ రోల్ తో పాటు స్పెషల్ గా సాంగ్ చేయడానికి ఇటీవల దర్శకుడు కాజల్ ని సంప్రదించాడట. దీనికి వెంటనే కాజల్ ఓకే చెప్పినట్టు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక స్పెషల్ సాంగ్ తో పాటు కీలక పాత్రలో కాజల్ మెరవనుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
