కాజల్ ఎంగేజ్మెంట్ రింగ్ చూశారా?
on Oct 24, 2020
తెలుగు వెండితెరపై 'చందమామ'గా వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి టైమ్ దగ్గర పడుతోంది. ఈ నెలాఖరున గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ పెళ్లి పనులు యమా జోరుగా సాగుతున్నాయి. షాపింగులు, గట్రా మొదలయ్యాయి. త్వరలో పూర్తి కానున్నాయి.అగర్వాల్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.
రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో 'షాదీ వానిటీ' అని కాజల్ ఒక పోస్ట్ చేశారు. అందులో చేయి తప్ప ఏమీ లేదు. పరీక్షగా చూస్తే చేతి వెలికి ఓ ఉంగరం కనిపిస్తుంది. అది కాజల్ ఎంగేజ్మెంట్ రింగ్ అన్నమాట. సాధారణ ఉంగరాల కంటే కొంచెం పెద్దదిగా ఉంది. పెళ్లి కోసం కాజల్ అగర్వాల్ డిజైనర్ దుస్తులు ధరించనున్నారని, ఆల్రెడీ డిజైనింగ్ పూర్తయిందని సన్నిహితుల సమాచారం.
కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పగానే ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ ఆమెకు శుభాకంక్షాలు తెలిపారు. కాజల్, గౌతమ్ జోడీ బాగుందని కొందరు అభిమానులు అంటున్నారు. మరికొందరి అభిమానులు పెళ్లి తరవాత కూడా కాజల్ నటిస్తానని చెప్పడంతో సంతోషిస్తున్నారు.
Also Read