ప్రెగ్నెన్సీని ఖరారు చేసిన కాజల్!
on Sep 23, 2017
కాజల్ అగర్వాల్ ఓ కథానాయికగానే మనందరికీ తెలుసు. నిజజీవితంలో ఆమెకు ఓ గొప్ప ప్రమోషన్ వచ్చింది. ప్రెగ్నెన్సీ వ్యవహారాన్ని ఇటీవలే తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసింది కాజల్. ఎంతో ఆనందంగా ఉందనీ... ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాననీ ఆమె మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ఇంతవరకూ పెళ్లే కాని కాజల్ కి ప్రెగ్నెన్సీ ఏంటి? ఈ ప్రమోషన్ ఏంటి? అనుకుంటున్నారా? విషయం ఏంటంటే...
ప్రెగ్నెన్సీ.. కాజల్ కి కాదు. కాజల్ సోదరి నిషా అగర్వాల్ కి. ఇటీవల ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. దీంతో... కాజల్ కి పెద్దమ్మగా ప్రమోషన్ వచ్చింది. కాజల్ ఆనందానికి కారణం ఇదే. ఆ సంతోషంలోనే ట్విటర్ లో పోస్ట్ చేసింది.
30ఏళ్లు దాటాక కూడా ఇంకా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ సాగిస్తోంది కాజల్. రీసెంట్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’తో గ్రాండ్ సక్సెస్ కొట్టింది. తమిళంలో ‘వివేగం’తో మంచి విజయం దక్కించుకుంది. ఆ విధంగా దక్షిణాదిన అగ్ర కథానాయికగా తన హవాని కొనసాగిస్తోంది కాజల్. త్వరలోనే.. ‘నేనే రాజు నేనే మంత్రి’ తమిళ వెర్షన్ కూడా విడుదల కానుంది. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటూ... ‘జోగేంద్రతో నా ప్రేమ ఇలాగే ఇంకొంతకాలం కొనసాగాలి’ అని ట్విటర్ లో మరో కామెంట్ కూడా పోస్ట్ చేసింది కాజల్.
ఏది ఏమైనా... తెరపై అగ్ర కథానాయికగా... ఇంట్లో పెద్దమ్మగా.. కాజల్ మరపురాని అనుభూతినే పొందుతోంది. ఏంమంటారు ఫ్రెండ్స్?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
