రాజనీకాంత్ తర్వాత సూర్యతో సినిమా..!
on Jun 27, 2016

రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన "కబాలి" సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నిన్ననే ఈ సినిమా ఆడియో విడుదల వేడుక హైద్రాబాద్ లో జరిగింది. "కబాలి" అనంతరం రంజిత్ సినిమా ఎవరితోనా? అనే చర్చలు నిన్నటివరకూ చెన్నై వర్గాల్లో జరిగేవి, ఆ చర్చలకు స్వస్తి పలుకుతూ.. "నా నెక్స్ట్ సినిమా సూర్య"తో అని కన్ఫర్మ్ చేసేశాడు రంజిత్. నిజానికి.. కార్తీతో తెరకెక్కించిన "మద్రాస్" అనంతరం సూర్య కోసం కథను సిద్ధం చేసుకొన్నాడు రంజిత్.. అయితే ఈలోపు రజనీ నుంచి పిలుపు రావడంతో, సూర్య సినిమాను పక్కనపెట్టి "కబాలి"ని తెరమీదకు తీసుకువచ్చాడు. ఇకపోతే.. రంజిత్ కు తెలుగు హీరోల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. సూర్య సినిమా అనంతరం తెలుగులోనూ ఒక సినిమా చేస్తానని చెప్పాడు రంజిత్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



