Kaantha: ఓటీటీలోకి కాంత.. రిజల్ట్ రివర్స్ అవుతుందా..?
on Dec 8, 2025

విభిన్న చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన రీసెంట్ మూవీ 'కాంత'(Kaantha). తమిళ్ లో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. నవంబర్ 14న థియేటర్లలో అడుగుపెట్టిన కాంత సినిమా.. ప్రశంసలు అయితే అందుకుంది కానీ, కాసులు కురిపించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'కాంత' సినిమా పీరియడ్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కింది. 1950 సమయంలో గురు శిష్యులైన డైరెక్టర్, హీరో మధ్య ఇగో క్లాష్ గా మొదలై.. మర్డర్ మిస్టరీగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. 1950 నాటి సినీ ప్రపంచం నేపథ్యంలో రూపొందిన 'కాంత'.. నటీనటుల అద్భుత పర్ఫార్మెన్స్, కథలో మలుపులతో ఆకట్టుకుంది. అయితే కమర్షియల్ గా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
'కాంత' చిత్రం త్వరలో ఓటీటీలో అడుగుపెట్టనుంది. డిసెంబర్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటలోకి రానుంది.
మరి 'కాంత' మూవీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



