కళాఖండం మళ్లీ చెక్కడానికి చిరు గ్రీన్‌సిగ్నల్
on Oct 27, 2016
.jpg)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి కాంభినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎడతెరిపిలేని వర్షాల్లోరిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు కలెక్షన్ల వర్షాన్ని కురిపించారు. అలా ఈ మూవీ చిరంజీవి కెరిర్‌తో పాటు తెలుగు చిత్రాల్లో క్లాసిక్‌గా నిలిచిపోయింది. ప్రజంట్ అలనాటి సినిమాలకు సిక్వెల్స్‌లు జోరందుకోవడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా మరో సినిమాను నిర్మించాలని నిర్మాత అశ్వినీదత్ నిర్ణయించారు.
అందులో భాగంగా ఇప్పటికే జగదేకవీరుడు అనే టైటిల్‌ని ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అలనాటి కథను ప్రజంట్ జనరేషన్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేయంచి క్రిష్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ప్లాన్ చేస్తున్నారు దత్. ఈ విషయాన్ని ఇటీవల మెగాస్టార్ వద్ద ప్రస్తావించగా..చిరంజీవి అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ధృవ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చెర్రి ఓ సినిమా చేయనున్నాడు. ఇది పూర్తయిన వెంటనే జగదేకవీరుడిని పట్టాలెక్కించాలని అశ్వీనిదత్ భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



