పోస్టర్ తోనే మొత్తం చెప్పేసిందిగా..?
on Aug 28, 2017
ఈ మధ్య సినిమా పోస్టర్ లు ఎలా ఉంటున్నాయంటే.. పోస్టర్ చూస్తే చాలు దాదాపు సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పోస్టరే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా.. “జూలీ 2”. హాట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న బాలీవుడ్ లో త్వరలో “జూలీ 2” రూపంలో మరో హాట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఒకటి పోస్ట్ చేసింది లక్ష్మీ రాయ్. మంగళవారం నాడు మధ్యాహ్నం 2.30 నిముషాలకు “జూలీ 2” టీజర్ విడుదల కాబోతుందని ప్రకటిస్తూ…ఈ సినిమాలోని ఒక సెక్సీ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్ లో షార్ట్ డ్రెస్ వేసుకుని బైక్ పక్కన వెనుక నుండి పోజ్ ఇచ్చిన లక్ష్మీరాయ్ పిక్.. ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది. మరి ఈసినిమాతో బాలీవుడ్ లో పాతుకుపోవాలన్న లక్ష్మీరాయ్ కల నెరవేరుతుందో..?లేద..? చూద్దాం..