ఆ టైటిల్ ఏంటి? ఆ లుక్కేంటి ఎన్టీఆర్??
on May 21, 2018

ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుక అభిమానులకు ముందే అందేసింది. త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన లుక్, టైటిల్ రెండూ బయటకు వచ్చేశాయి. ముందే అనుకున్నట్టు... ఎన్టీఆర్ తన సిక్స్‌ప్యాక్ దేహంతో దడదడలాడించేశాడు. చురుకైన చూపులు, చేతిలో ఆయుధం, కాస్త గుబురు గడ్డంతో గుబులు పుట్టించేస్తున్నాడు బుడ్డోడు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. రాయలసీమ అనగానే యాక్షన్, యాక్షన్ మామూలే.. దానికి తగ్గట్టుగానే లుక్ డిజైన్ చేశారు. సాధారణంగా హీరోలు ఇలా సిక్సు ప్యాకులు చేస్తే... ఆ లుక్ సినిమా విడుదల ముందు వరకూ జాగ్రత్తగా ఉంచుతారు. కానీ త్రివిక్రమ్ మాత్రం అంత ఆలస్యం చేయలదచుకోలేదు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేశాడు.. అనగానే అభిమానులు చాలా చాలా ఊహిస్తారు. సినిమా ఆలస్యం అవుతున్న కొద్దీ ఆ అంచనాలు పెరుగుతుంటాయి. వాటిని పెంచడం ఇష్టం లేకపోవడం వల్లే.. ముందుగా సిక్స్ ప్యాక్ లుక్ విడుదలచేసినట్టు అనిపిస్తోంది. బర్త్ డే కాబట్టి.. ఏదో సాఫ్ట్ లుక్ వదులుతారనుకుంటే.. సిక్స్ ప్యాక్ స్టిల్‌తో షాక్ ఇచ్చింది త్రివిక్రమ్ బృందం. టైటిల్ విషయానికొస్తే.. 'అరవింద సమేత వీర రాఘవ' అని పెట్టారు. టైటిల్ పొయెటిగ్‌గా ఉంది. టైటిల్‌కీ లుక్‌కీ అస్సలు సంబంధమే కనిపించడం లేదు. టైటిల్ బాగానే ఉన్నా... అభిమానులు అర్థం చేసుకుని, అలవాటు చేసుకోవడానికి టైమ్ పడుతుంది. మొత్తానికి... ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ అదిరిందనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



