దీక్షా..ఎందుకంత కక్ష
on Sep 18, 2017

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచనలంగా మారిపోయింది. మొదట్లో ఆడియన్స్‌కి కాస్త బోర్ కొట్టించినా..రాను రాను షో మాంచి ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఇప్పటికే కంటెస్టంట్స్ తమ తమ కేరక్టర్స్ ఏంటో బయటపెడుతూ..తమ రియల్ లైఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. షో స్టార్టింగ్ నుంచి ఉన్న అర్చనకు..వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షో హౌస్‌లో అడుగుపెట్టిన దీక్షా పంత్‌కు ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఎందుకో తెలియదు కానీ అర్చనని దీక్షా పంథ్‌శత్రువుగా ఫీలవుతూ వస్తోంది. మనసులో ఒకరిపై ఒకరికి తెలియని ద్వేషం నాటుకుపోయింది.
ఇద్దరు కలిసి నటించింది లేదు..పాత పరిచయం అసలే లేదు..అయినా ఎందుకు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్లేదు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకోవడం..తిట్టుకోవడం..చాడీలు చెప్పుకోవడం కామన్ అయిపోయింది. ఒకానొక టైంలో ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు కలర్ ఇచ్చి..కౌగిలించుకున్నారు. అయితే ఎలిమినేషన్ తర్వాత దీక్షతో ఎన్టీఆర్ ఆడించిన వీరి వీరి గుమ్మడి పండు గేమ్‌లో అసలు రంగు బయటపడింది. అందరి గురించి రాసినట్లుగానే అర్చన గురించి కూడా దీక్ష ఒక వర్డ్ రాసింది. అదేంటో తెలుసా..? అర్చన పెద్ద సెల్ఫీష్ అని. తాను అలా ఎందుకు రాశానో కూడా క్లారిటీ ఇచ్చింది దీక్షా పంత్. అయినా ఏం చేస్తాం..దీక్ష ఎలిమినేట్ అయిపోయింది. దీంతో గత కొద్ది రోజులుగా ఉప్పు-నిప్పులా ఉంటూ ఆడియన్స్‌లో ఎంగ్జయిటీ పెంచిన దీక్షా-అర్చన జోడికి ముగింపు పలికినట్లయ్యింది. మరిప్పుడు అర్చన ఎవరితో గొడవ పడుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



