రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్
on May 25, 2017
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని..తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించాలని చాలా మంది అభిమానుల కోరిక. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసి వారి విజయంలో కీలకపాత్ర పోషించారు జూనియర్. అయితే ఆ తర్వాత రాజకీయాలకు టెంపరరీగా బ్రేక్ వేసి తన ఫోకస్ సినిమాలపై పెట్టారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల నుంచి ఒత్తిడి ఓ రేంజ్లో వస్తోంది. వారి ఆకాంక్ష మేరకు తాను త్వరలో పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు యంగ్ టైగర్.
ఈ పోలిటికల్ ఎంట్రీకి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ అంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ చదరంగం, రణరంగం రెడీ అవుతుందని టాక్. అసలు ఇంత అర్జెంట్‌గా ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటీ..? దీనిపై కాకలు తేరిన రాజకీయ ఉద్దండులు ఏమంటున్నారు ఇవన్నీ సినిమాలోనే చూడాలి...ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటోంది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్ పాలిటిక్స్‌లో. త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ చేయబోయే సినిమా పక్కా పొలిటికల్ థ్రిల్లర్ కథ అంటూ ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు. కానీ ఇంత వరకు ఎన్టీఆర్ కానీ, త్రివిక్రమ్ కానీ దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాతోనూ..ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాతోనూ బీజీగా ఉన్నారు.