యంగ్ టైగర్ కెరీర్ కు 15 ఏళ్లు..!
on May 25, 2016
యంగ్ టైగర్. ఈ పేరు ఇండస్ట్రీలో కరెక్ట్ గా సెట్ అయ్యేది ఆ ఒక్కడికే. తాతకు తగ్గ మనవడిగా, అద్భుతమైన పెర్ఫామర్ గా, మాస్ జనాల్లో ఊర మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న నందమూరి తారక రామారావుకు మాత్రమే ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈరోజుకు తారక్ సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు అయ్యింది. హీరోగానే కాదు, నటుడిగా కూడా సినిమా సినిమాకూ తనను తాను మార్చుకుంటూ, మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా తారక్ కెరీర్లోని మరిచిపోలేని పాత్రలు చూద్దామా..
1. ఆది
ది పవర్ ఆఫ్ ఎమోషన్ అన్న ట్యాగ్ లైన్ కు జస్టిఫికేషన్ చేస్తూ, ఈ సినిమాలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు యంగ్ టైగర్. తొడకొట్టే సీన్ అయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆల్ టైం ఫేవరెట్.
2. సింహాద్రి
మాస్ హీరోగా ఎన్టీఆర్ కు తిరుగులేని ఇమేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా. పెర్ఫామెన్స్ పరంగా పీక్స్. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ ను మరింత బలపరిచిన సినిమా.
3. యమదొంగ
తాతకు తగ్గ మనవడు అంటే ఎలా ఉంటాడో నందమూరి అభిమానులకు కాస్త టేస్ట్ చూపించిన సినిమా. పెద్దాయన డైలాగ్ కు తగ్గట్టే తన సొంత డైలాగ్ చెప్పి, అందరికీ ఆయన్ను గుర్తు చేశాడు జూనియర్.
4. అదుర్స్
తారక్ లోని వెర్సటాలిటీని చూపించిన సినిమా. కామెడీ పరంగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. అతనిలాంటి మాస్ హీరో ఈ పాత్ర ఒప్పుకోవడం సాహసమే.
5. బృందావనం
తనను తాను మాస్ లుక్ నుంచి క్లాస్ గా, పోష్ గా చూపించడానికి ఎన్టీఆర్ చేసిన ప్రయత్నం.
6. నాన్నకు ప్రేమతో
ఇన్నాళ్లూ నటన మీద దృష్టి పెట్టిన యంగ్ టైగర్, తాను స్టైలిష్ గా తయారైతే ఏ రేంజ్ లో ఉంటాడో శాంపిల్ ఇచ్చిన ఎమోషనల్ థ్రిల్లర్