ముంబైలో షర్ట్ లేకుండా ఎన్టీఆర్ కొట్లాట!
on May 21, 2024
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా సినిమాకి తనను తాను మలచుకునే తీరు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. పాత్రకి తగ్గట్టుగా ఆయన తన దేహాన్ని, ఆహార్యాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ బొద్దుగా ఉండేవాడు. ముఖ్యంగా 'రాఖీ' సినిమాలో ఆయన లుక్స్ పై విమర్శలు వచ్చాయి. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ.. ఫిజిక్ మీద దృష్టి పెట్టకపోవడం ఎన్టీఆర్ కి మైనస్ అని సన్నిహితులు సైతం అభిప్రాయపడ్డారు. దాంతో 'యమదొంగ'కు బాగా సన్నగా అయ్యి.. అందరినీ సర్ ప్రైజ్ ఎన్టీఆర్. ఆ తర్వాత నుంచి సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా తన ఫిజిక్ ని.. ఎలా అంటే అలా మలుస్తున్నాడు. ముఖ్యంగా 'టెంపర్'లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో కనిపించి వావ్ అనిపించాడు. ఆ తర్వాత 'అరవింద సమేత'లో కూడా షర్ట్ లేకుండా మొండి కత్తి చేతపట్టి.. ఊచకోత కోసి.. థియేటర్స్ లో కేకలు వేయించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి షర్ట్ లెస్ యాక్షన్ ఎపిసోడ్ కి సిద్ధమవుతున్నాడు.
'వార్ 2' (War 2) సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హృతిక్ పాత్రకి ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఎన్టీఆర్ పై తెరకెక్కించే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తాడట. ఈ సీక్వెన్స్.. 'అరవింద సమేత' ఫైట్ ని మించేలా ఉండి, గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. 'వార్ 2' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ భారీ యాక్షన్ సన్నివేశం కూడా ముంబైలోనే షూట్ జరుపుకోనుందట.
Also Read