ఎన్టీఆర్‌పై మాట మార్చిన సింగం డైరెక్టర్
on Dec 1, 2016

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తనకు ఎవరో తెలియదన్న తమిళ డైరెక్టర్ హరి వ్యాఖ్యలు రెండు పరిశ్రమల్లోనూ ఎంత వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. నందమూరి అభిమానులతైతే కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో హరి మాట మార్చాడు. ఎన్టీఆర్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయనకు ఒకసారి కథ కూడా వినిపించా. అసలు ఈ వార్త ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ఎన్టీఆర్ సినిమాలన్నీ తప్పకుండా చూస్తా..పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన టెంపర్ రెండుసార్లు చూశా..నిజం చెప్పాలంటే ఆయనకు నేను పెద్ద అభిమానిని అలాంటప్పుడు ఆయన తెలియకుండా ఉంటాడా..తెలియదని నేను ఎలా అనగలను అంటూ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



